మోదీవి సూచనలు
- ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం
- నేషన్ ఫస్ట్ సిద్ధాంతంతో బీజేపీ పనిచేస్తున్నది
- పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి): ప్రధాని మోదీ చేసిన సూచనలు బలవంతపు ఆంక్షలు కావని, దేశ ప్రయోజనం కోసం ప్రజలు స్వచ్ఛందంగా పాటించాల్సిన సూచనలు మాత్రమే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నా రు. కాంగ్రెస్ ప్రధాని వ్యాఖ్యలపై తప్పుడు ప్రచా రం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అవసరం లేని బంగారం కొనుగోళ్లు తగ్గించాలి, విదేశీ పర్యటనల కంటే దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహిం చాలి, స్వదేశీ వస్తువులను కొనాలి, ఇంధన పొదుపు పాటించాలి అనే ఉద్దేశంతో ప్రధాని ఈ సూచనలు చేశారని చెప్పారు.
బీజేపీ ఎప్పుడూ నేషన్ ఫస్ట్ సిద్ధాంతంతోనే పని చేస్తుందని, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం పవర్ ఫస్ట్ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. దేశ ప్రయోజనం ముందు రాజకీయాలు ఉండకూడదన్నారు. కాం గ్రెస్ పార్టీ కావాలనే వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని మండిపడ్డారు. సీఎం రేవం త్‌రెడ్డి, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వంటి నాయకులు ప్రధాని మోదీ చేసిన సూచనలపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.
లండ న్, అమెరికా, యూరప్ దేశాల్లో హైకోర్టు న్యాయమూర్తులు, ఎంపీలు, మంత్రులు, ప్రధానులు ప్రజా రవాణానే ఉపయోగిస్తారని, లండన్‌లో ట్యూబ్స్ పేరుతో అండర్ గ్రౌండింగ్ మెట్రో వ్యవస్థను విస్తృతంగా ఉపయోగిస్తున్నారని చెప్పారు. అది ఆర్థిక క్రమశిక్షణ, పర్యావరణ పరిరక్షణ కోసమన్నారు. వ్యక్తిగత ఆర్థిక క్రమశిక్షణ వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందన్నారు. ప్రధాని మోదీ సూచనలను విమర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ తమ గత చరిత్రను తెలుసుకోవాలన్నారు.
జవహర్‌లాల్ నెహ్రూ ప్రజలకు బియ్యం వినియోగం తగ్గించాలని చెప్పారని, ఉత్తర భారతదేశ ప్రజలను రొట్టెల వినియోగం తగ్గించాలని కోరార న్నారు. రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వా త వారానికి ఒకసారి ఉపవాసం ఉండాలని కూడా ప్రజలకు సూచించారన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి ప్రతి సోమవారం భోజనం మానే యాలని దేశ ప్రజలను సూచనలు చేశారని, ఇంది రా గాంధీ హయాంలో టాక్ లెస్ - మోర్ నినాదం తీసుకొచ్చారని, ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్యాన్ని అణచివేశారన్నారు.
1976లో బలవంతపు కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు చేపట్టారని, సంజయ్ గాంధీ ఆధ్వర్యంలో బలవంతపు స్టెరిలైజేషన్ కార్యక్రమాలు అమలు చేశారని, ప్రజలపై ఒత్తిడి తెచ్చి వాసెక్టమీ ఆపరేషన్లు చేయించారన్నారు. మన్మోహన్ సింగ్ సబ్సిడీలను తగ్గించాల్సిందే అన్నారు. ఆర్థిక సంక్షోభ సమయంలోకాంగ్రెస్ నాయకులే ప్రజలకు చెప్పార న్నారు. 2013లో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం కూడా బంగారం కొనుగోలు నిలిపివేయాలంటూ ప్రజలను కోరారని, అప్పుడు కాం గ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడలేదు? అని ప్రశ్నించారు.
పపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఉన్నాయని, పశ్చిమాసియా పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ ఇంధన మార్కెట్ల పై ప్రభావం పడుతోందని, అనేక దేశాల్లో పెట్రో ల్ ధరలు భారీగా పెరిగాయన్నారు. భారత్‌లో పెట్రోల్ ధరలను కేంద్ర ప్రభుత్వం స్థిరంగా ఉం చిందన్నారు. యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాల మధ్య తేడా గణాంకాల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. యూపీఏ కాలంలో రూ.2 లక్షల వరకు మాత్రమే పన్ను మినహాయింపు ఉండగా, ఇప్పుడు రూ. 12.75 లక్షల వరకు పన్ను రాయితీ కల్పించామన్నారు.
యూపీఏ కాలంలో బ్యాంకుల ఎన్పీఏలు 11 శాతం ఉండగా, ఇప్పుడు 0.6 శాతానికి తగ్గాయన్నారు. యూపీఏ కాలంలో మౌలిక వసతు లపై రూ.1.57 లక్షల కోట్లు ఖర్చుచేస్తే, ఎన్డీఏ రూ.44.3 లక్షల కోట్లకు పెంచారన్నారు. యూపీ ఏ కాలంలో రూ.13 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగితే, ఎన్డీఏ కాలంలో రూ.320 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగిందన్నారు. 2014లో దేశ విదేశీ మారక నిల్వలు సుమారు 304 బిలియన్ డాలర్లు ఉండగా, ఇప్పుడు 655 బిలియన్ డాలర్లకు పెరిగాయన్నారు. 2014లో ప్రపంచ జీడీపీ ర్యాంకింగ్‌లో భారత్ 10వ స్థానంలో ఉండగా, ప్రస్తుతం 5వ స్థానానికి చేరుకున్నదన్నారు.






