5 July, 2026 | 2:41 AM

భద్రాద్రి ఎయిర్‌పోర్టులో కీలక అడుగులు

05-07-2026 12:58 AM
  1. సీతంపేట, సుజాతనగర్ అనుకూల ప్రాంతాలు
  2. కేంద్ర మంత్రి రామ్మోహన్‌కు మంత్రి తుమ్మల నివేదిక 

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 4 (విజయక్రాంతి): దశాబ్దాలుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లావాసులు ఎదురుచూస్తున్న గ్రీన్‌ఫీల్ విమానాశ్రయం కల సాకారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. గ్రీన్‌ఫీల్ ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై శనివారం రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు లేఖ రాశారు.

ఏటీఆర్- 72-600 తరహా విమానాలకు అనుగుణంగా విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో జిల్లాలోని ఆరు  ప్రాంతాల్లో భూమి లభ్యత, భూతల స్వరూపం, రన్వే దిశ, ఎత్తు పరిమితి ఉపరితలాలు (అబ్స్టకల్ లిమిటేషన్ సర్ఫేసెస్), పర్యావరణ అంశాలు, రవాణా సౌక ర్యాలను నిపుణుల బృందం క్షుణ్నంగా పరిశీలించింది. సీతంపేట, సుజాతనగర్ ప్రాం తాలు అవసరమైన కీలక సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా, అనుకూలమైన భూ తలం, భూవినియోగం, నిర్వహణ పరిస్థితులతో ఉన్నట్లు తేలింది.

సుమారు 667 ఎక రాల ప్రతిపాదిత అభివృద్ధి స్థలాన్ని ఎలాం టి ప్రధాన పర్యావరణ, సాంకేతిక అవరోధాలు లేకుండానే సమకూర్చవచ్చని నివేదిక స్పష్టం చేసింది. దీంతో ఏళ్లుగా నానుతున్న స్థల నిర్ధారణ సమస్యకు తెరపడే అవకాశం కనిపిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యూహాత్మక ప్రాంతంలో ఉండటమే కాక, విశాలమైన గిరిజన, పారిశ్రామిక, పర్యాటక ప్రాంతంగా విలసిల్లుతోందని మంత్రి తుమ్మ ల తన లేఖలో పేర్కొన్నారు.