25 August, 2026 | 6:16 PM

అన్ని గ్రామాల్లో వనమహోత్సవం

25-08-2026 05:44 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని అన్ని గ్రామాల్లో  మంగళవారం వన మహోత్సవం సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం ఎంపీడీవో గంగాధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మాల్తుమ్మెద, వదలపర్తి, పోచారం, ధర్మారెడ్డి గ్రామాలలో ఎంపీడీవో గంగాధర్, ఎల్లారెడ్డి డిఎల్పిఓ సురేందర్, ఏపీవో సక్కుబాయి, ఈసీ సాయిలు సర్పంచులతో కలిసి పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామంలో పచ్చదనం పెంపొందించాలనే లక్ష్యంతో పలు రకాల మొక్కలను నాటారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో గంగాధర్ మాట్లాడుతూ...మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యని,నాటిన మొక్కలను సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చనన్నారు.మొక్కలు నాటడం మన బాధ్యత,వాటిని సంరక్షించడం మన భవిష్యత్ తరాలకు ఇచ్చే గొప్ప బహుమతి అని పేర్కొన్నారు. పచ్చదనం పెరుగుదల పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు.

వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఒక్కరోజు మండలంలో అన్ని గ్రామాలలో కలిపి 1000 మొక్కలు నాటడం జరిగిందన్నారు.ధర్మారెడ్డి, వదలపర్తి గ్రామాల్లో ఫామ్ పాండుకు ముగ్గు పోసి పూజ చేయడం జరిగింది.ఎల్లారెడ్డి డిఎల్పిఓ సురేందర్ మాట్లాడుతూ...అటవీ ప్రాంతంలో నీటిని ఆదా చేదాం,భవిష్యత్తును కాపాడుదాం అనే నినాదంతో  ఫామ్ పౌండ్కు  ముగ్గు పోయడం జరిగిందన్నారు. ఫామ్ పౌండ్తో వర్షపు నీటి విలువతో భూగర్భ జలాలు పెరుగుతాయని, పర్యావరణ పరిరక్షణ భూమిని నీటిని కాపాడుతూ పంటలకు నిరంతర నీటి భరోసా ఉత్పత్తి ఆదాయం పెరుగుతుందని వ్యవసాయ రంగంలో చేయూత అందిస్తాయని అవగాహన కల్పించారు.