calender_icon.png 14 January, 2026 | 12:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు భద్రత మాసోత్సవాల్లో డ్రైవర్లకు కీలక సూచనలు

13-01-2026 10:16:15 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లిలో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, నాలుగు చక్రాల వాహనాల్లో సీట్ బెల్ట్ వాడాలని తెలిపారు. ఆటో రిక్షాల్లో ముందు సీట్లో ప్రయాణికులను కూర్చోబెట్టకూడదని, మొబైల్ ఫోన్ ఉపయోగించరాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు, ఐటీడీఆర్ సిబ్బంది పాల్గొన్నారు.