13-01-2026 10:13:55 PM
మద్నూర్,(విజయక్రాంతి): మద్నూర్ మండలం రాచుర్ గ్రామానికి చెందిన కల్లప్ప పటేల్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, రాచుర్ గ్రామానికి వెళ్లి కల్లప్ప పటేల్ కుటుంబ స భ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు.
ఈ సందర్భంగా షిండే మాట్లాడుతూ... కల్లప్ప పటేల్ అకాల మరణం కుటుంబానికి తీరని లోటు అని, ఈ దుఃఖ సమయంలో బి ఆర్ యస్ పార్టీ ఎల్లప్పుడూ కల్లప్ప కుటుంబానికి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.కుటుంబానికి అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమం లో మద్నూర్ మండల బి ఆర్ స్ పార్టీ అధ్యక్షులు బన్సీ పటేల్, బిచ్కుంద మాజీ సొసైటీ చైర్మన్ నాల్చర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.