30 March, 2026 | 6:58 AM

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు

17-02-2025 01:06 AM
  1. ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
  2. హరీశ్‌రావుపై చక్రధర్‌గౌడ్ పిటిషన్‌పై కదలికలు

సిద్దిపేట, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. సిద్దిపేటకు చెందిన రియల్‌ఎస్టేట్ వ్యాపారి, కాంగ్రెస్ లీడర్ చక్రధర్‌గౌడ్ తన ఫోన్‌లను ట్యాపింగ్ చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ గతంలో హైదరాబాద్‌లోని పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

దర్యాప్తులో భాగంగా ఆదివారం సిద్దిపేటకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావు ఏ1 ఉన్నా రు. సిద్దిపేట పట్టణంలోని భవానీ కమ్యూనికేషన్స్ నిర్వహకుడు సంతోష్ కుమార్, నారాయణరావుపేటకు చెందిన బండి పరశురాం (కార్ డ్రైవర్), టీ వంశీకృష్ణ (నల్గొండ జిల్లాలో ఆరోగ్యశ్రీ మేనేజర్‌గా పని చేశాడు) ఫోన్ ట్యాపింగ్‌లో వీరిపాత్ర ఉన్నట్లు గుర్తించిన హైదరాబాద్ వెస్ట్ జోన్ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

ఇతరుల గుర్తింపు కార్డులపై సీమ్ కార్డులు తీసుకొని చక్రధర్‌గౌడ్‌కు ఫోన్ చేసి, వాట్సాప్‌లలో మెసేజ్‌లు చేస్తూ బెదిరింపులకు పాల్పడటంలో ఈ ముగ్గురు కీలక పోషించినట్లు పోలీసులు ఆధారాలతో వారిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. విచారణ తర్వాత హరీశ్‌రావుపై వస్తున్న ఆరోపణలపై త్వరలోనే నిజాలు వెలుగులోకి వస్తాయని సమాచారం.