30 March, 2026 | 8:30 AM

బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్

17-02-2025 01:08 AM
  1. వెలవెలబోయిన చికెన్ దుకాణాలు
  2. మటన్ షాపుల వద్ద రద్దీ.. పలుచోట్ల కొరత
  3. కిలో 1000 పలికిన మేక మాంసం
  4. చేపల విక్రయ కేంద్రాలూ కిటకిట

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): వారాంతం కోసం ఎదురుచూసే మాంసంప్రియులకు ఈ ఆదివారం చేదును మిగిల్చింది. కొన్ని రోజులుగా బర్డ్ ఫ్లూతో ఆంధ్రప్రదేశ్‌లో గణనీయంగా కోళ్లు చనిపోవడంతో ఆ ప్రభావం తెలంగాణలోని చికెన్ సెంటర్లపై పడింది. రాష్ట్రంలో అంతగా ప్రభా వం లేకపోయినా కోడి మాంసం అమ్మకాలపై బర్డ్ ఫ్లూ ప్రభావం చూపింది.

గతవారంతో పోలిస్తే ఈ వారం చికెన్ విక్రయాలు బాగా తగ్గా యి. ఆదివారం ఉదయం దుకాణాల వద్ద ఉండే క్యూలైన్‌లు కనిపించలేదు. గతవారం రూ.220గా ఉన్న చికెన్ ధర.. ఈ వారం రూ.150-180కి పడిపోయింది. విక్రయానికి తీసుకొచ్చిన కోళ్లు అలాగే మిగిలిపోవడంతో చికెన్ దుకాణాల నిర్వాహకులు ఆవేదన చెందారు.

దాదాపు 70 శాతం చికెన్ విక్రయాలు తగ్గినట్టు పలువురు వ్యాపారులు వాపోయారు. బర్డ్ ఫ్లూ భయంతో మాంస ప్రియులు చికెన్‌పై ఆసక్తి చూపటం లేదని, తినొచ్చని డాక్టర్లు, శాస్త్రవేత్తలు చెప్పినా ప్రజలు భయపడుతున్నారని చెబుతున్నారు. మరోవైపు మటన్, చేపలు, సీఫుడ్స్ దుకాణాల వద్ద వినియోగదారుల రద్దీ కనిపించింది.

కొన్ని చోట్ల క్యూలైన్లు దర్శనమిచ్చాయి. ఇ దే అదునుగా భావించి రూ.800 ఉండే కిలో మటన్‌ను రూ.900 నుంచి రూ.1000 వరకు విక్రయించారు. మరికొన్ని చోట్ల మటన్ కొరతతో పలువురు వినియోగదారులు వెనుదిరిగినట్టు తెలుస్తోంది. చేపలు, రొయ్యల ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. ఒక్కసారిగా పెరిగిన ధరలతో మధ్య తరగతి కు టుంబాలు మటన్ కొనడం కష్టంగా మారింది. 

ఆర్డర్లూ తగ్గాయ్

బర్డ్ ఫ్లూ భయంతో రెస్టారెంట్లలో బిర్యానీ ఆర్డర్ పెట్టడాన్ని వినియోగదారులు తగ్గించారు. చికెన్ బిర్యా నీతోపాటు చికెన్ వంటకాలు ప్రజ లు తినడం లేదని తెలుస్తోంది. రె గ్యూలర్‌గా దాదాపు 60 శాతం ఉండే చికెన్ బిర్యానీ, ఇతర చికెన్ వంటకాలు క్రమంగా 30 నుంచి 40 శాతానికి పడిపోయినట్టు పలువురు రెస్టారెంట్ల నిర్వాహకులు, డెలివరీబాయ్స్ తెలిపారు.

చికెన్ వంటకాల స్థానంలో మటన్, సీఫుడ్ వంటకాలను ఆర్డర్ చేసుకుంటున్నట్టు వాపో యారు. ఆర్డర్లు తగ్గిపోవడంతో హో టళ్ల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు చికెన్ వంట కాలపై తీవ్ర ప్రభావం ఉంది. చికెన్ 65, తందూరి చికెన్, మలై చికెన్, చికెన్ కర్రీ తదితర వంటకాలు ప్రజ లు రుచి చూడటం లేదు. దీంతో కొన్ని హోటళ్లలో బిర్యానీపై ప్రత్యేక ఆఫర్లు పెడుతున్నారు. అయినా ప్రజ ల నుంచి ఆశించిన స్పందన లేదు.