30 March, 2026 | 5:25 AM

టీఐఎస్-2025కు కేటీఆర్‌కు ఆహ్వానం

17-02-2025 12:51 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): ‘ఎంట్రప్రెన్యూర్ ఇండి యా’ బెంగుళూరులో నిర్వహించే ప్రతిష్ఠాత్మక ‘టెక్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్-2025’లో పాల్గొనాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆదివారం ఆహ్వానం అందింది. ‘ది ఏఐ టెకెడ్’ థీమ్‌తో నిర్వహించనున్న ఈ సమ్మిట్‌లో ‘డ్రైవింగ్ డిజి టల్ ఇండియా’ అంశంపై కేటీఆర్ కీలక ప్రసంగం చేయనున్నారు.