8 June, 2026 | 7:22 PM

Breaking News

పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •  

4.5 కిలోల అండాశయ కణతి తొలగింపు

16-10-2024 01:37 AM

మహిళను ప్రాణాప్రాయం నుంచి రక్షించిన వైద్యులు

కామారెడ్డి, అక్టోబర్ 15 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పిట్లం మండలం పిట్లం తండాకు చెందిన మెగావత్ లలిత(41) అనారోగ్యంతో బాధపడుతూ ఈ నెల 10న ఎల్లా రెడ్డి పట్టణంలోని ఎల్లారెడ్డి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరింది. వైద్యులు స్కానింగ్ చేయగా కడుపులో అండాశయ కణతి ఉన్నట్టు గుర్తించారు. మంగళవారం శస్త్ర చికిత్స చేసి 4.5 కిలోల అండాశయ కణతిని వైద్యుడు రవీంద్రమోహన్ తొలగించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళకు శస్త్ర చికిత్స చేసి కణతిని తొలగించడంతో రోగి బంధువులు డాక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.