25 May, 2026 | 9:02 PM

అవగాహన రాహిత్యంగా వ్యవహరిస్తున్న మున్సిపల్ చైర్మన్

25-05-2026 08:14 PM

ఏకపక్ష నిర్ణయాలు సరికాదు

డిసిసి వైస్ చైర్మన్ రాజురా సత్యం

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అవగాహన రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఏకపక్ష నిర్ణయాలు సరికాదని నిర్మల్ కాంగ్రెస్ జిల్లా వైస్ చైర్మన్ కౌన్సిలర్ రాజుర సత్యం ఆరోపించారు. సోమవారం ఖానాపూర్ మున్సిపల్ సాధారణ సమావేశం ముందస్తు ఏర్పాట్లు లేకుండా, కనీసం కమిషనర్ లేకుండా, ఎటువంటి ఎజెండా లేకుండా ఏర్పాటు చేశారని  వైస్ చైర్మన్ ఈ ఆరోపణలు చేశారు. ఎప్పుడైనా సమావేశం నిర్వహించేటప్పుడు మున్సిపాలిటీలో ఉన్న సమస్యల ఎజెండా తయారుచేసి, వాటిపై చర్చించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఖానాపూర్ అభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన అన్నారు.