30 June, 2026 | 8:39 PM

Breaking News

రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •   సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం   •  

కాజీపేటలో బాలుడి కిడ్నాప్

29-09-2024 01:02 AM

హనుమకొండ, సెప్టెంబర్ 28 (విజయక్రాం తి): హనుమకొండ జిల్లా కా జీపేటలో బా లుడి కిడ్నాప్ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. వచ్చింది.  బాధితులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. వరంగల్ రంగశాయిపేటకు చెందిన ఎస్‌కె మసూద్, కౌసర్ దంపతులకు ఐదేళ్ల అయాన్, మూడేళ్ల ఇఫ్తాన్ ఉన్నారు. ఇద్దరు కు మారులతో కలిసి జనగామకు వెళ్లేందుకు శుక్రవారం సాయంత్రం కాజీపేటకు చేరుకున్నారు.

ఆ సమయంలో జనగామకు వెళ్లేందుకు రైళ్లు లేకపోవడంతో రైల్వే ఇనిస్టిట్యూట్ గేట్ వద్ద కొద్దిసేపు వేచి ఉన్నారు. కౌసర్ చిన్న కుమారుడిని వెంటబెట్టుకుని భోజనం తెచ్చేందుకు కాజీపేట చౌరస్తాకు వెళ్లింది. మసూద్ పెద్ద కుమారుడిని అక్కడే  ఉంచి లగేజ్‌ను రైల్వేస్టేషన్‌లో పెట్టేందుకు వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి అయాన్ కనిపించకపోవడంతో అక్కడున్న వారిని అడిగాడు.

ఆటోలో వచ్చిన ముస్లిం దంపతులు తీసుకెళ్లినట్లు తెలిపారు. దీంతో లబోదిబోమంటూ బాధిత దంపతులు కాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పట్టించుకోలేదని తెలిసింది. అయితే బాలుడి కిడ్నాప్ వ్యవహారం సామాజిక మాద్యమాల్లో వైరల్ కావడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి ఆచూకీ కోసం విచారణ ప్రారంభించారు.