25 August, 2026 | 1:29 PM

మంద బొగుడపాఠశాలలో కిచెన్ గార్డెన్

25-08-2026 12:44 PM

బోథ్. ఆగస్ట్ 25 (విజయ క్రాంతి): మండలంలోని మంద బొగుడ పాఠశాలలో మంగళవారం గ్రామ సర్పంచ్ బాబులాల్ ఉపాధ్యాయుడు దయాకర్ ఆధ్వర్యంలో కిచెన్ గార్డెన్ లో మొక్కలు నాటారు. 25 రకాల మొక్కలు నాటినట్లు గ్రామ కార్యదర్శి సైకిల్ హైమత్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో కిచెన్ గార్డెన్ల ఏర్పాటు కొనసాగుతున్నది. భవిష్యత్తులో పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్న దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ఈ నరేష్ ఫీల్డ్ అసిస్టెంట్ దూదిరాం లు ఉన్నారు.