ఫీజు బకాయిలపై బీజేపీ లడాయి..రెండో రోజూ దీక్ష!
25-08-2026 11:57 AM
హైదరాబాద్ ఆగస్టు25(విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చేపట్టిన నిరాహార దీక్ష రెండో రోజూ కొనసాగుతోంది. ‘ఫీజు బకాయి–బీజేపీ లడాయి’ పేరుతో ఈ దీక్ష నిర్వహిస్తున్నారు. బీజేపీ నేత రామచందర్‌రావుతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు దీక్షలో పాల్గొన్నారు. బకాయిలు వెంటనే విడుదల చేయాలని బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కాగా, మధ్యాహ్నం 3 గంటలకు రామచందర్‌రావు దీక్ష విరమించనున్నారు.






