10 March, 2026 | 1:48 AM

పేదింటి కల కాంగ్రెస్‌తోనే సాధ్యం

10-03-2026 12:13 AM

ఎమ్మెల్యే బీఎల్‌ఆర్

వేములపల్లి, మార్చి 9: పేదోడి సొంత ఇంటి కల కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని శెట్టిపాలెం గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవానికి హాజరై ప్రారంభించి అనంతరం నూతన సిసి రోడ్ల నిర్మాణాన్ని ప్రారంభించి మాట్లాడారు.

నియోజకవర్గంలో ఇప్పటికే 3500 ఇండ్ల నిర్మాణం చేపట్టామని అన్నారు. ఒక్క మిర్యాలగూడ పట్టణంలోని 2500 మంజూరు పై సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఎంపీడీవో జితేందర్ రెడ్డి సర్పంచులు పెదమం సైదులు పిల్లల సందీప్ జెర్రీపోతుల మౌనిక సురేందర్ కార్యదర్శి నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.