1 May, 2026 | 2:07 AM

డీఎంహెచ్‌ఓ స్వర్ణకుమారిని కలిసిన కేఎన్‌ఆర్ సేవాదళం

01-05-2026 12:06 AM

ఆమనగల్లు, ఏప్రిల్ 30, (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా నూతన డీఎంహెచ్‌ఓగా గురువారం బాధ్యతలు చేపట్టిన డాక్టర్ స్వర్ణకుమరిని కెఎన్‌ఆర్ సేవాదళం వ్యవస్థాపక అధ్యక్షులు మెకానిక్ బాబా గురువారం మర్యాదపూర్వకంగా కలువడం జరిగింది.

ఈ సందర్భంగా  ఆమెను శాలువాలతో సత్కరించి, పూలమొక్కను అందించి శుభాకాంక్షలు తెలుపారు.అనంతరం జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉంచేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని, డీ ఎంహెచ్‌ఓ ని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలోజిల్లా డెమో అధికారి శ్రీనివాస్,ప్రోగ్రాం అధికారి అక్రమ్,ఏవో షఫీ,తదితరులు పాల్గొన్నారు.