మోతె పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కోదాడ డీఎస్పీ
మోతె, జులై 16: మోతె పోలీస్ స్టేషన్ ను కోదాడ డి.ఎస్.పి శ్రీనివాస్ రెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా కొన్ని విషయాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అసాంఘిక కార్యక్రమాలపై నిఘా పెట్టాలని అన్నారు.
మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని 28 గ్రామాలలో డ్రగ్స్ గంజాయి వంటి నిషేదిత మత్తు పదార్థాలు గుట్టుగా అమ్మకాలు జరిపిన కొనుగోలు చేసిన వాడాకం చేసిన అక్రమ ఇసుక వ్యాపారం చేసిన స్థానిక పోలీసు సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు. యేండ్ల తరబడి పెండింగ్ లో ఉన్న పలు సమస్యలను వెంటనే పరిష్కారం చేసుకునే విధంగా ఇరు వర్గాలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మునగాల సి ఐ రామకృష్ణ రెడ్డి, యస్ బి. లచ్చి రెడ్డి, ఏ యస్ ఐ లు శ్రీరాములు, మల్లయ్య, సిబ్బంది శ్రీకాంత్, శ్రీనివాస్, కోటేశ్వరరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






