calender_icon.png 20 February, 2026 | 7:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందుబాటులోకి నాణ్యమైన వైద్యం

20-02-2026 05:55:22 PM

శ్రీ లేఖ హాస్పిటల్‌ను ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్

కోదాడ: కోదాడ పరిసర ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన శ్రీ లేఖ హాస్పిటల్‌ను శుక్రవారం కోదాడ మున్సిపల్ చైర్‌పర్సన్  ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.

పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ జాస్తి సుబ్బారావు మాట్లాడుతూ... వైద్యో నారాయణో హరి అనే సూక్తిని స్మరిస్తూ, వైద్యాన్ని కేవలం వ్యాపారంగా చూడకుండా సామాజిక దృక్పథంతో రోగులకు సేవలు అందించాలన్నారు. ఆసుపత్రి వైద్యులు మీసా రోహిత్, కూరపాటి శ్రీలేఖ కోదాడలో సేవలు అందించడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కారింగుల అంజి, వైద్యులు దశరథ, రామారావు, అశోక్, గౌరీనాథ్, ప్రసాద్, కరుణశ్రీ,  సురేష్,  కొత్తమాసు జనార్ధన్ పాల్గొన్నారు.