4 August, 2026 | 3:10 AM

విద్యార్థులకు అండగా కొడారి చారిటబుల్ ట్రస్ట్

04-08-2026 02:07 AM

60 మందికి నోట్‌బుక్కులు, పెన్నుల పంపిణీ

అశ్వాపురం, ఆగస్టు 3 (విజయక్రాంతి):  అశ్వాపురం మండల కేంద్రంలో సమాజ సేవే లక్ష్యంగా కొడారి చారిటబుల్ ట్రస్ట్ను సోమవారం డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య ఘనంగా ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 60 మంది విద్యార్థులకు సుమారు 400 నోట్బుక్స్, పెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకుడు కొడారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్య, వైద్యం, సామాజిక సేవా రంగాల్లో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడమే ట్రస్ట్ లక్ష్యమన్నారు.

ముఖ్య అతిథి తుళ్లూరి బ్రహ్మయ్య  మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా జర్నలిస్టుగా ప్రజాసేవలో కొనసాగుతున్న కొడారి వెంకటేశ్వర్లు సేవా కార్యక్రమాల కోసం ట్రస్ట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ‘విద్యే అసలైన ఆస్తి.. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి విద్యతో ఉన్నత లక్ష్యాలను సాధించాలి‘ అని సూచించారు. ఈ కార్యక్రమంలో దోసపాటి రంగారావు చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ పిచ్చేశ్వరరావు, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్, జిల్లా మాజీ కో-ఆప్షన్ సభ్యుడు ఎం.డి. షరీఫుద్దీన్, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఎస్. ఖదీర్, కాంగ్రెస్ నాయకుడు ముత్తినేని శ్రీనివాస్, ట్రస్ట్ సభ్యులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.