calender_icon.png 19 February, 2026 | 10:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొదురుపాక ఆరోగ్య కేంద్రం తనిఖీ

19-02-2026 12:00:00 AM

బోయినపల్లి: ఫిబ్రవరి 18(విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో వ్యాధి నిరోధక టీకాల నిలువలను పరిశీలించి, ఐస్లాండ్ రిఫ్రిజిరేటర్ శీతలీకరణ+2 నుండి+8 వరకు నిర్వహించాలని సూచిస్తూ, రికార్డులను పరిశీలించి, వ్యాధి నిరోధక టీకాలు0-5 సంవత్స రాలు లోపు పిల్లలకు సకాలంలో వెయ్యాలని, కేంద్ర ఆరోగ్య పథకాల నిర్దేశించిన ల క్ష్యాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యాధి నిరోధక టీకాలు అధికారి డాక్టర్ సంపత్ కుమార్, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక మరి యు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.