22 March, 2026 | 8:26 PM

మంచి భవిష్యత్తు ఉండాలి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

06-07-2024 03:04 AM

“మునుగోడు ప్రాంతానికి చెందిన పారుమళ్ల లింగయ్య ‘ప్రణయ గోదారి’ అనే ఓ మంచి సినిమాను నిర్మించినందుకు అభినందనలు, సిని మా రంగంలో ఆయనకు మంచి భవిష్య త్తు ఉండాలని కోరుకుంటున్నా” అన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. సాయికుమార్ ప్రధాన పాత్రలో సీఎల్‌వీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రమే ‘ప్రణయ గోదారి’. ఈ సినిమాలోని సాయికుమార్ లుక్‌ను రాజగోపాల్‌రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. ఈ సినిమాలో ఇంకా సదన్, ప్రియాంక ప్రసాద్ కూడా నటిస్తుండగా, మార్కండేయ సంగీత సహకారం, ఈదర ప్రసాద్ కెమెరా మెన్‌గా పనిచేస్తున్నారు.