9 July, 2026 | 1:14 PM

గురుకుల (పీటీజీ) విద్యార్థులకు అస్వస్థత

09-07-2026 12:08 PM
  1. ఉదయం అల్పాహారం తర్వాత వాంతులు 
  2. చికిత్స కోసం ఆస్పత్రికి తరలింపు 
  3. నిలకడగా విద్యార్థుల ఆరోగ్యం 

అచ్చంపేట జులై 09: నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) మన్ననూరులోని గురుకుల (పిటిజి) విద్యాలయంలో ఉదయం అల్పాహారం తిన్న పలువురు విద్యార్థులు అస్వస్థత గురయ్యారు. గురువారం ఉదయం విద్యార్థులకు రోజు మాదిరి అన్నం, టమాటో, చట్నీ చారుతో కూడిన ఆహారాన్ని అందించారు. టిఫిన్ అనంతరం విద్యార్థులు మిషన్ భగీరథ నీళ్లు తాగారు.

దీంతో 25 మంది విద్యార్థులు వాంతులు చేసుకొని అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే చికిత్స కోసం మననూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడ నుంచి అచ్చంపేటలోని ప్రార్థిస్తూ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తాగునీటి కసుశితం వలన విద్యార్థులకు అస్వస్థత చోటు చేసుకున్నట్లుగా స్థానికులు అనుమానిస్తున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆర్డిఓ యాదగిరి, డిఎస్పి శ్రీనివాస్,  డిప్యూటీ డిఎంహెచ్వో తారా సింగ్ పరామర్శించారు.