9 July, 2026 | 1:10 PM

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

09-07-2026 12:16 PM

శంషాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్(Shamshabad) మండలం సాతంరాయి వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) సంభవించింది. బస్ స్టాప్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న ముగ్గురు మహిళలపైకి మిర్చి లోడ్‌తో వెళ్తున్న బొలెరో వాహనం దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. ఈ దుర్ఘటనలో ఆ ముగ్గురు మహిళలు వాహనం కింద నలిగిపోయి అక్కడికక్కడే మృతి చెందారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (Osmania General Hospital)కు తరలించారు. పోలీసులు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదాలను నివారించేందుకు స్పీడ్ బ్రేకర్లు, జీబ్రా క్రాసింగ్‌లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ ప్రమాదం నేపథ్యంలో స్థానిక ప్రజలు నిరసన చేపట్టారు.