రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి
కోనరావుపేట, ఆగస్టు 20: కోనరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మానుక సత్యం ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులర్పించి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని, దేశసేవలో ఆయన వీరమరణం పొందారని అన్నారు. రాజీవ్ గాంధీ ఆశయాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నూతన సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిలు షేక్ ఫిరోజ్ పాషా, గొట్టే రుక్మిణి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తాళ్లపల్లి ప్రభాకర్, సర్పంచులు మస్కూరి కాశీరాం, లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మాందాల లింబయ్య, మ్యాకల ప్రభాకర్ రెడ్డి, అజీమ్ పాషా, ఆత్మ కమిటీ మెంబర్ ధర్మయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






