‘కారు’ దిగి ‘చేయి’ అందుకోనున్న కోనేరు చిన్ని?

27-04-2024 02:45:20 AM

భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): భద్రాద్రి జిల్లాలో బీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. భధ్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. శుక్రవారం బీఆర్‌ఎస్ నేత ఎడవల్లి కృష్ణ హైదరాబాద్‌కు వెళ్లి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా మరో బీఆర్‌ఎస్ నేత కోనేరు సత్యనారాయణ (చిన్ని) పార్టీ రాజీనామా చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయిందరని తెలుస్తున్నది. మాజీ మంత్రి దివంగతి  కోనేరు నాగేశ్వరరావు  తనయుడైన కోనేరు చిన్ని రాజకీయ ప్రస్థానం టీడీపీలో ప్రారంభమైంది. 2014లో ఆయన ఆ పార్టీ నుంచి కొత్తగూడెం శాసనసభ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం బీజేపీలో చేరి ఆ పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని చేపట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీకి రాజీనామా చేసి గులాబీ గూటికి చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తున్నది.