ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలి
l పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
l ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్‌లో జెండావిష్కరణ
హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి ): బీఆర్‌ఎస్ 23వ ఆవిర్భావ వేడుకలను అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో నిర్వహించాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కార్యాలయాల్లోనే జరుపుకోవాలని సూచించారు. ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్‌లో జెండా ఆవిష్కరణ ఉంటుందని వెల్లడించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు పార్టీ తరఫున ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్ష లు తెలిపారు. 2001 ఏప్రిల్ 27న తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం కేసీఆర్ పార్టీని స్థాపించారని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించి, బంగారు తెలంగాణ నిర్మాణం కోసం పార్టీ అహర్నిశలు చేసిందని కేటీఆర్ వివరించారు.






