16 March, 2026 | 8:26 AM

ఘనంగా కోట మైసమ్మ బోనాలు

16-03-2026 12:00 AM

రాజాపూర్ మార్చి 15:మండల పరిధిలోని తిరుమలాపూర్ గ్రామంలో ఆదివారం కోట మైసమ్మ నేరెళ్లపల్లి మైసమ్మ బోనాల ఉత్సవాలు గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు. గ్రామాన్ని రక్షించే అమ్మ వారికీ మహిళలు అమ్మవారికి ఇష్టమైన బోనం సమర్పించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.

రైతులు పాడి పంటలు బాగా పండాలని ప్రజలంతా సుఖ సంతోషంగా ఉండాలని ఎడ్లబండ్లు ట్రాక్టర్లతో అమ్మవారికి ప్రదక్షణ చేసి ముక్కలు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బంగారి సంతోష వెంకటేష్ ఉపసర్పంచ్ రామచంద్ర, పుల్లారెడ్డి నరసింహులు విష్ణువర్ధన్ రెడ్డి చంద్రయ్య శ్రీనివాస్ రెడ్డి విష్ణు నర్సింలు రెడ్యానాయక్,చెన్నయ్య నర్సింలు తదితరులు పాల్గొన్నారు.