కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పొలికెపాడు
- సర్పంచ్‌తో పాటు ఉప, వార్డు సభ్యులు
ఇందిరమ్మ రాజ్యంలోనే అభివృద్ధి
ఇందిరమ్మ ఇళ్ళను ప్రారంభించిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి
గోపాలపేట మార్చ్ 15 : ఇందిరమ్మ రాజ్యంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుందని వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి అన్నారు. ఆదివారం గోపాలపేట మండలంలోని తాడిపర్తి, బుద్ధారం ఏదుట్ల లక్ష్మీ తండాల లో ఇందిరమ్మ ఇల్లు పూర్తయిన నిర్మాలను ఎమ్మెల్యే మెగా రెడ్డి పాల్గొని గృహప్రవేశాలను చేశారు. అదేవిధంగా పొలికేపాడు గ్రామంలో హెల్త్ సెంటర్ ప్రారంభించారు.
పోలికపాడు గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే మెగా రెడ్డిని ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి బంగారయ్య తోపాటు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు 60 మంది ఒకేసారి ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇందిరమ్మ రాజ్యంలో చేసే అభివృద్ధి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందని ఇండిపెండెంట్ గా ఉంటే తన గ్రామం అభివృద్ధికి నోచుకోదని. ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధి జరుగుతుందని ముక్కుముడిగా గ్రామంలో ఉన్న నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.
వనపర్తి నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలను సైతం ప్రతి ఒక్కటి అభివృద్ధిలోకి తీసుకొస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీకి జై అనడంతో గ్రామమంతా మారుమోగింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బంగారయ్య ఉపసర్పంచ్ జంపన్నతో పాటు గోపాల్ పేట మండల ఇంచార్జ్ సత్యశిలా రెడ్డి వార్డు మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




