16 March, 2026 | 6:47 AM

2027 జనాభా లెక్కలు దేశాభివృద్ధికి కీలకం

16-03-2026 12:00 AM

జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ 

మెదక్, మార్చి 15 (విజయ క్రాంతి): 2027 జనాభా లెక్కలు ప్రభుత్వ పథకాల అమలుకు కీలకం కావడంతో, అధికారులు పూర్తి అవగాహనతో, క్షేత్రస్థాయిలో బాధ్యతగా పని చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ పేర్కొన్నారు. జిల్లాలో జనాభా గణన2027 సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా, మండల స్థాయి అధికారులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆర్డీవోలు మెదక్ రమాదేవి, తూప్రాన్ జై చంద్రారెడ్డి, నర్సాపూర్ ఆర్డీవో రామకృష్ణ, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, డీఎఫ్‌ఓ జోజి గణన అధికారులతో కలిసి అదనపు కలెక్టర్ నగేష్ ఆదివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలో జనాభా గణనను సమర్థమంతంగా నిర్వహించేందుకు అవసరమైన విధానాలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈ జనాభా గణన రెండు దశల్లో జరుగుతుందని, మొదటి దశలో హౌస్ లిస్టింగ్ (ఇళ్ల జాబితా) గృహాల గణన మే 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు, రెండో దశలో జనాభా గణన 2027 ఫిబ్రవరిలో జరుగుతుందని వివరించారు.

మార్చి 1, 2027ను రిఫరెన్స్ తేదీగా పరిగణిస్తారన్నారు. మండలంలో తహసిల్దార్, మున్సిపాలిటీలో కమిషనర్ చార్జ్ వ్యవహరిస్తారన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఆర్డీవోలు, ఎంపిడిఓలు, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.