calender_icon.png 18 February, 2026 | 3:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యప్ప ఆలయంలో కోవ లక్ష్మి పూజలు

18-02-2026 01:59:39 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి  స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్, వైస్‌ చైర్మన్ ఎం.డి. అహ్మద్‌, కౌన్సిలర్లు చిలువేరు వెంకన్న, కుర్సెంగ బాలకృష్ణ,  దూడల లక్ష్మి, సలాం బిన్ అహ్మద్ తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులకు ఆలయ అర్చకులు నగేష్  తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, శాంతియుతంగా ఉండాలని ఎమ్మెల్యే  ఆకాంక్షించారు.ఈ పూజా కార్యక్రమంలో తణుకు సాయి శ్రావణ్, సందీప్,అశోక్, ప్రేమ్‌కుమార్, తుకారాం, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.