calender_icon.png 18 February, 2026 | 3:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రత్యేక గ్రామ సభలో పాల్గొన్న ఆర్డీవో మధుసూధన్

18-02-2026 01:58:15 PM

హైవే బ్రిడ్జ్ వెడల్పులో భూములు కోల్పోతున్న రైతులతో సమావేశం 

ధర్మపురి,(విజయక్రాంతి): వెల్గటూర్ మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ బండమీది కవితగోపి అధ్యక్షతన బుధవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రామసభలో జగిత్యాల రెవిన్యూ డివిజనల్ అధికారి(Jagityala Revenue Divisional Officer) పులి మధుసూధన్ పాల్గొన్నారు. వెల్గటూర్ - రాజక్కపల్లి గ్రామాల పరిధిలో రాష్ట్రరహదారిపై ఉన్నటువంటి పెద్దవాగు బ్రిడ్జ్ వెడల్పు పక్రియలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులతో మండల తహసీల్దార్ రాపెల్లి శేఖర్ సమావేశం ఏర్పాటు చేయగా జగిత్యాల ఆర్డీవో పులి మధుసూధన్ హాజరై రైతులతో నేరుగా మాట్లాడారు. బ్రిడ్జి వెడల్పులో భాగంగా ఎకరం ఏడు గుంటలనర భూమి అవసరం కాగా బ్రిడ్జ్ ను ఆనుకొని ఉన్న భూములు గుర్తించడం జరిగిందన్నారు.ఇందులో 14మంది రైతులు తమయొక్క భూములను కోల్పోనున్నట్లు ఆయన తెలిపారు.భూములు కోల్పోతున్న రైతులు ఎవరూ కూడా అధైర్యపడొద్దనీ,ప్రభుత్వం అండగా ఉంటుందనీ ఆయన రైతులకు భరోసా కల్పించారు.

మా రైతులను ఆదుకోండి సార్!: అధికారులతో ఆవేదన వ్యక్తం చేసిన రాజక్కపల్లి గ్రామ సర్పంచ్ దోరిశెట్టి మల్లేశం

బ్రిడ్జ్ వెడల్పులో భాగంగా భూములు కోల్పోతున్న తమ గ్రామ రైతులను ఆదుకోవాలంటూ రాజక్కపల్లి గ్రామ సర్పంచ్ అధికారులతో తమ ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం లింకు2 కోసం తమ గ్రామరైతులు 75ఎకరాలు భూమిని గతంలో కోల్పోయారని, రైతులకు అందాల్సిన సరైన నష్ట పరిహారం అందలేదనీ గుర్తు చేశారు. అభివృద్ధి కి తామేనాడూ అడ్డుచెప్పమనీ ఆయన స్పష్టం చేశారు. కనీసం ఇప్పుడు భూములు కోల్పోతున్న రైతులకు అయిన సరైన న్యాయం అందేలా చర్యలు చేపట్టాలనే అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

అభివృద్ధికి సహకరిస్తూ మా గ్రామ రైతులు  ఉన్న భూములు అన్నీ కోల్పోయి అనాధల్లా మిగిలారనీ, గ్రామ అభివృద్ధికి జిల్లా స్థాయి అధికారులు సహకరించాలనీ ఆర్డీవో పులి మధుసూధన్ తో ఆయన తన ఆవేదనను వెల్లబుచ్చారు. సర్పంచ్ విన్నపానికి స్పందించిన ఆర్డీవో ప్రజాప్రయోజన అవసరాలకోసం అధికారులుగా తమవంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందనీ స్పష్టం చేశారు.రెవెన్యూ శాఖ పరిధిలో రాజక్కపల్లి గ్రామ అభివృద్ధికి ఏవిధంగా సహకరించవచ్చునో  అట్టి ప్రణాళిక చర్యలు చేపట్టాలనీ అక్కడే ఉన్న తహసీల్దార్ రాపెల్లి శేఖర్ కు ఆర్డీవో సూచించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ పరిశీలకులు దొంత రాజేశ్వరి, రాoరెడ్డి, ఇరిగేషన్ అధికారి రాకేష్, ఉపసర్పంచ్ గండ్ర ప్రతాప్ రావు, వార్డు సభ్యులు గుండెటీ సందీప్ రెడ్డి, నక్క సురేష్,ఎనగందుల నరేష్, ధ్యావనపెల్లి రజితఅశోక్, రంగు మానస మారుతి, రైతులు పాల్గొన్నారు.