25 July, 2026 | 1:47 AM

బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు

25-07-2026 12:42 AM

వేములవాడ, జూలై 24 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను వేములవాడలో బీఆర్‌ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు.  భీమేశ్వరాలయంలో కోడెమొక్కు చెల్లించి, ప్రత్యేక పూజలు చేశారు. కేటీఆర్  నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు.

అనంతరం భక్తులకు పండ్లను పంపిణీ చేశారు.కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, వెంగళ శ్రీకాంత్ గౌడ్, వాసాల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు సిరిగిరి చందు, మారం కుమార్, పలువురు పట్టణ నాయకులు పాల్గొన్నారు.