25 July, 2026 | 2:17 AM

బ్లాస్టింగ్, అక్రమ మైనింగ్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు

25-07-2026 01:43 AM

ఆమనగల్లు, జులై 24 (విజయక్రాంతి): ఆమనగల్లు పురపాలక సంఘం 13వ వార్డు (సర్వే నం. 662/ఆ/2) లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ మరియు మైనింగ్ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు శుక్రవారం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.

పేలుళ్ల ధాటికి తీవ్ర శబ్ద, దుమ్ము కాలుష్యంతో పాటు సమీప ఇళ్లు పగుళ్లు బారుతున్నాయని, ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల సంయుక్త విచారణ జరిపి, అక్రమ మైనింగ్ను వెంటనే నిలిపివేసి, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. కార్యక్రమంలో జంతుక శివ, పులికంటి మహేష్, గోరేటి జగన్, వంకశ్వరం బీమయ్య పాల్గొన్నారు.