15 July, 2026 | 4:10 AM

ఫిరాయింపులపై రాహుల్ వ్యాఖ్యలను ఎవరు నమ్ముతారు : కేటీఆర్

04-07-2024 06:55 PM

హైదరాబాద్ :  రాజ్యాంగం గురించి మాట్లాడే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ  రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలో విఫలమయ్యారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఇతర పార్టీలలో గెలిచిన వారిని కాంగ్రెస్ లో చేర్చుకుంటూనే పార్టీ ఫిరాయింపులపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలను దేశంలోని ప్రజలు నమ్మరన్నారు. 

రాజ్యాంగాన్ని కాపాడటం అంటే ఇదేనా అని కేటీఆర్ ప్రశ్నించారు. తాము ఇచ్చిన హామీ పార్టీల ఫిరాయింపులను నిరోధిస్తామని మేనిఫెస్టో అంశంపై చిత్తశుద్ది ఉంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎంఎల్ఏలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. కె. కేశవరావు రాజీనామాను తము స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు.