15 July, 2026 | 4:02 AM

వరంగల్ అభివృద్ధిపై రాష్ట్ర మంత్రుల సమీక్ష

04-07-2024 07:31 PM

హైదరాబాద్ :  వరంగల్ నగర అభివృద్ధిపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన గురువారం సుమారుగా 6 గంటలపాటు విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, వరంగల్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వరంగల్ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసు తెలిపారు.

వరద ముప్పు నుంచి వరంగల్ కు విముక్తి కల్పించి యుద్ద ప్రాతిపదికన వరంగల్ అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. వరంగల్ నగరం చుట్టూ నిర్మించనున్న ఐఆరఆర్ భూసేకరణ, ఓఆర్ఆర్ అలైన్మెంట్, వరంగల్ మాస్టర్ ప్లాన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, జీడబ్ల్యూఎంసీ పరిధిలోని ప్రధాన నాళాల రిటైనింగ్ వాల్ ల నిర్మాణం, వరద నివారణ చర్యలు, ఇంకుడు గుంతల నిర్మాణం,   కాళోజీ జయంతికి కళాక్షేత్రం నిర్మాణ పనులు తదితర అంశాలపై చర్చించారు.