15 July, 2026 | 4:17 AM

ఆసుపత్రి నుంచి ఎల్‌కే అద్వానీ డిశ్చార్జ్

04-07-2024 05:31 PM

న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత, భారతరత్న ఎల్‌కే అద్వానీ(96) అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అద్వానీ అస్వస్థతతో బుధవారం అపోలో ఆసుపత్రి చేరారు. గత వారం రోజుల క్రితం ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి వచ్చిన ఆయనకు టెస్టులు నిర్వహించి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం అద్వానీ వృద్ధాప్యంతో బాధపడుతున్నారు.