20 May, 2026 | 1:30 AM

ఎప్‌సెట్ ర్యాంకర్ రుషికి కేటీఆర్ అభినందనలు

20-05-2026 12:00 AM

పట్టుదలతో ముందుకు సాగితే విజయాన్ని అందుకోవచ్చు

హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి): ఎప్‌సె ట్-2026 ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 156.63 మార్కులతో రాష్ట్ర స్థాయిలో తొలి ర్యాంక్ సాధించిన ఉప్పల్ చిలుకనగర్ డివిజన్‌కు చెందిన మల్లాడి రుషికి బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు. మంగళవారం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ నివాసంలో ఆయన చేతుల మీదుగా లక్ష రూపాయల చెక్కును ఆమెకు అందజేశారు. 

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి కష్టపడి చదివి రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. రుషి విజయం చిలు కనగర్ డివిజన్‌తో పాటు మొత్తం ఉప్పల్ నియోజకవర్గానికి గర్వకారణమని పేర్కొన్నారు. నేటి యువత లక్ష్యసాధన కోసం పట్టుదల తో ముందుకు సాగితే ఎలాంటి విజయాన్నైనా అందుకోవచ్చని రుషి నిరూపించారని కొనియాడారు.

విద్యార్థులు క్రమశిక్షణ, సమయపాలన, నిరంతర శ్రమతో చదివితే ఉన్నత ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం, విద్యార్థి అంకితభావం కలిసి విజయానికి పునాది అవుతాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మల్లాడి రుషి సాధించిన ఘన విజయంపై సంతో షం వ్యక్తం చేస్తూ, తెలంగాణ విద్యార్థులు దేశ స్థాయిలో తమ ప్రతిభను చాటుతున్నారని తెలిపారు.

రుషి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖ రాలు అధిరోహించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో మాజీ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్, మీర్ పేట హౌసింగ్ బోర్డు డివిజన్ మాజీ కార్పొరేటర్ ప్రభుదాస్, పార్టీ రాష్ట్ర నాయకులు సోమ శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.