7 May, 2026 | 3:43 PM

Breaking News

అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు   •   నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి   •   పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •  

అయినను పోయి రావాలె హస్తినకు

17-10-2024 10:23 AM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. అయినను పోయి రావాలె హస్తినకు అంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో పైసా పనిలేదని తెలిపారు. సీఎం ఢిల్లీ పర్యటనతో రాష్ట్రానికి రూపాయి లాభం లేదన్నారు. 10 నెలలు - 25 సార్లు - 50రోజులు, పోను 25 సార్లు, రాను 25 సార్లు ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసి సిల్వర్ జూబ్లీ కూడా చేస్తివని ఎద్దేవా చేశారు.  తట్టా మట్టి తీసింది లేదు కొత్తగా చేసింది.. అసలే లేదన్నారు. మూసీ, హైడ్రా పేరుతో పేదోళ్ల పొట్టలు కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 420 హామీలను మడతపెట్టి మూలకు వేశారని వ్యాఖ్యానించారు. పండగలు లేవు.. ఆడబిడ్డలకు చీరలు అందలేదని మండిపడ్డారు. అవ్వాతాతలు అనుకున్న పింఛను లేదు,  తులం  బంగారం జాడనే లేదు స్కూటీలు లేవు, కుట్టు మిషిన్లు లేవని  కేటీఆర్ ఆరోపించారు.