7 May, 2026 | 2:49 PM

Breaking News

అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు   •   నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి   •   పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •  

నేడు హర్యానా సీఎంగా సైనీ ప్రమాణస్వీకారం

17-10-2024 10:31 AM

చండీగఢ్ : భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు నయాబ్ సింగ్ సైనీ హర్యానా ముఖ్యమంత్రిగా రెండవసారి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పంచకుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్యమంత్రులు హాజరవుతారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణస్వీకారం ప్రమాణం చేయిస్తారు. ప్రమాణ స్వీకారోత్సవానికి 50 వేల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉన్నందున పంచకులలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వేదిక చుట్టూ ట్రాఫిక్ అడ్వైజరీ కూడా జారీ చేయబడింది. హర్యానా సీఎం ప్రమాణం తర్వాత ఎన్డీఏ నేతల కీలక సమావేశం నిర్వహించనున్నారు.