19 April, 2026 | 11:28 AM

మనవాళ్లు యుకేలో ఇంతమంది ఉన్నారా?

31-05-2025 10:04 PM

ఆనందం వ్యక్తం చేసిన కేటీఆర్..

మహబూబాబాద్ (విజయక్రాంతి): యూకే లో మనవాళ్లు ఇంతమంది ఉన్నారా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్(BRS Working President KTR) ఆనందపడ్డాడని యూకే లో విద్యాభ్యాసం చేస్తున్న కేసముద్రం పట్టణ వాసి గునిగంటి ఉదయ్ కిరణ్ తెలిపారు. విదేశీ పర్యటనలో ఉన్న కేటీఆర్ శుక్రవారం యూకే లోని కోవెంటరీ స్టేట్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గునిగంటి ఉదయ్ కిరణ్ వెళ్లి కేటీఆర్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... మన రాష్ట్రానికి చెందిన యువత ఇక్కడ నైపుణ్య అభివృద్ధి పొంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయడానికి సమయం కేటాయించాలని, తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరినట్లు ఉదయ్ కిరణ్ చెప్పాడు.