బాధిత కుటుంబాలకు కేటీఆర్ సాయం
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 27 (విజయక్రాంతి) : శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని హఫీజ్‌పేట డివిజన్ సాయినగర్‌కాలనీలో గాలివాన వల్ల ఇంటి రేలింగ్ కూల డంతో ఇద్దరు మృతిచెందిన ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిం చారు. బాధిత కుటుంబాలను సోమవారం స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో కలిసి ఆయన పరామర్శించారు. మృతిచెందిన బాలుడు సమద్, రషీద్ కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గాలిదుమారం వల్ల ప్రమాదం జరుగడం విచారకరమని, అకాల వర్షం, గాలివానకు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ఆయనతో కార్పొరేటర్లు శ్రీకాంత్, రాగం నాగేం దర్‌యాదవ్, స్థానిక నాయకులు బాలింగ్ గౌతమ్‌గౌడ్, వాలా హరీశ్‌రావు బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.






