రాజన్న సన్నిధికి పోటెత్తిన భక్తులు
28-05-2024 01:02 AM
రాజన్న సిరిసిల్ల, మే 27 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడకు భక్తులు పోటెత్తారు. శ్రీ రాజరాజేశర సామి దర్శనం కోసం సోమవారం తెల్లవారుజాము నుంచే భారీగా తరలివచ్చారు. గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిరహించిన అనంతరం కోడె మొక్కులు చెల్లించుకున్నారు. సామివారిని దరించుకునేందుకు ఏడు గంటలకు పైగా సమయం పట్టింది. భక్తులకు 5 వేల మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు ఆలయ ఈఓ రామకృష్ణ తెలిపారు.






