1 August, 2026 | 11:22 AM

ఎల్‌బీనగర్‌లో గాలివాన బీభత్సం

28-05-2024 01:00 AM

యుద్ధ్దప్రాదికన చర్యలు చేపట్టిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది

ఎల్బీనగర్, మే 27 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్, మన్సూరాబాద్, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో భారీగా స్థాయిలో ఈదురుగాలులు వీయడంతో వృక్షాలు నెలకూలాయి. కరెంట్ తీగలు తెగిపడ్డాయి. దీంతో పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. జీహెచ్‌ఎంసీ సిబ్బందితో పాటు విపత్తు నివారణ ప్రతిస్పందన (ఆర్డీఎఫ్) బృందాలు వెంటనే చర్యలు చేపట్టాయి. నేలకూలిన చెట్లను నరికి తొలిగిస్తున్నారు.

విద్యుత్‌శాఖ సిబ్బంది కరెంట్ సరఫరా పునరుద్ధరణకు యుద్ధప్రాదిపదిక చర్యలు చేపట్టారు. ఆయా డివిజన్లలోని పలు కాలనీల్లో కార్పొరేటర్లు నవజీవన్‌రెడ్డి, కొప్పుల నర్సింహరెడ్డి, పవన్‌కుమార్, వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పర్యటిస్తూ పనులను పర్యవేక్షిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో సోమవారం ఉదయం 8 గంటలకు కరెంట్ సరఫరాను పునరుద్ధరించారు. చాలాచోట్ల కరెంట్ స్తంభాలు కూలడంతో కరెంట్ సరఫరా పునరుద్ధరణ ఆలస్యమైంది. జీహెచ్‌ఎంసీ సిబ్బంది కూలిన చెట్లు, ఇతర వ్యర్థాలను తొలిగిస్తున్నారు.