మొక్కలకు నీరు పోసేదెవరు?
- ముడా పరిధిలోని మొక్కలు నీరు లేక ఎండుతున్న వైనం
- జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో నీరు లేక వాడిపోతున్న మొక్కలు
- టెండర్ ఖరారు.. నీరు అందిస్తాం: జడ్చర్ల మున్సి పల్ కమిషనర్ లక్ష్మారెడ్డి
మహబూబ్ నగర్, ఫిబ్రవరి 16 (విజయ క్రాంతి): మహబూబ్‌నగర్ జిల్లా రూపురేఖ లు మారుతున్నాయి. ముడా పరిధి కూడా విస్తరించింది. జడ్చర్ల ప్రధాన రోడ్లపై ఉన్న మొక్కలకు నిరంతరం నీరు పడుతున్న ప్రక్రి యను మూడా చూసుకుంటుంది. మొక్క లకు నీరు పట్టే ప్రక్రియకు సంబంధించి గతంలో వేసిన టెండర్ గత నెలలో ముగి సింది.
కాగా అప్పటినుంచి మొక్కలకు నీరు పోసేవారు కరువయ్యారు. జడ్చర్ల మున్సిపా లిటీ వారు ఈ మొక్కలకు నీరు పోసేందుకు ఆసక్తి చూపించడం లేదు.
మూడా పరిధిలో ఉన్న మొక్కలకు మొత్తం మూడ ఆధ్వర్యం లోనే నీరు అందించడం జరుగుతుందని, ఈ నెలలో టెండర్ ప్రక్రియ పూర్తి చేస్తామని ఉన్నతాధికాల నుంచి సమాచారం అందిం దని, టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే మొక్కలకు నీరు అందించడం జరుగుతుం దంటు జడ్చర్ల మున్సిపల్ కమిషనర్ లక్ష్మా రెడ్డి తెలిపారు.
టెండర్ ప్రక్రియ అయ్యే వరకు నీరు పోసేందుకు జడ్చర్ల మున్సిపాలి టీ కొంచెం ఆసక్తి చూపించాలని జడ్చర్ల పుర ప్రముఖులు కోరుతున్నారు.




