యాదిరెడ్డి కుటుంబానికి కేటీఆర్ వైద్య సాయం
04-08-2026 12:00 AM
కృతజ్ఞతలు తెలిపిన కుటుంబసభ్యులు
మొయినాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): మొయినాబాద్లోని తెలంగాణ ఉద్యమ అమరవీరుడు యాదిరెడ్డి సోదరుడు ఓంరెడ్డి కుమార్తె వైద్య చికిత్స కోసం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన నివాసంలో కలిసిన యాదిరెడ్డి కుటుంబ సభ్యులు (తల్లి చంద్రమ్మ, సోదరుడు ఓంరెడ్డి) కేటీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అమరవీరుడు యాదిరెడ్డి త్యాగాన్ని తెలంగాణ సమాజం ఎప్పటికీ మరువదని, అమరుల కుటుంబాలకు బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. చిన్నారిని ఆప్యాయంగా పలకరించి, బాగా చదువుకోవాలనిఆశీర్వదించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.






