4 August, 2026 | 1:46 AM

సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన నిర్మల జగ్గారెడ్డి

04-08-2026 12:00 AM

సంగారెడ్డి, ఆగస్టు 3 (విజయ క్రాంతి) : సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులను మున్సిపల్ చైర్మన్ కూన వనిత సంతోష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోవార్డు కౌన్సిలర్ సుష్మితా ప్రశాంత్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వార్డులో మౌలిక వసతుల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించే దిశగా అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీసీసి అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డి, పట్టణ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, కౌన్సిలర్ లు శైలేష్ రెడ్డి, నవాజ్, వీణకిరణ్, కాంగ్రెస్ నాయకులు రాజంపేట శ్రీనివాస్, కసిని రాజు, మోహన్, పట్టణ మైనారిటీ అధ్యక్షుడు ఆరిఫ్, ఎస్సీ సెల్ నాయకులు చిన్న, మనోజ్, ఇంతియాజ్, మూజీబ్ తదితరులు పాల్గొన్నారు.