4 August, 2026 | 1:53 AM

ఓసీ క్లబ్‌ను స్వాధీనం చేసుకోవాలి

04-08-2026 12:00 AM

మహబూబాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): మహబూబాబాద్ పట్టణంలో ఉన్న కోట్ల రూపాయల విలువ చేసే విశాలమైన 1930 నాటి (ప్రభుత్వ క్లబ్) ఓసీ క్లబ్ గా ప్రచారంలో ఉన్న దానిని సందర్శించి స్వాధీనం చేసుకోవాలని మహబూబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అనిల్ కుమార్ కు సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, కౌన్సిలర్ బి.అజయ్ సారధి రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అజయ్ సారధి రెడ్డి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని కోట్ల విలువ చేసే విశాలమైన ప్రభుత్వ క్లబ్ ను వెంటనే ప్రభుత్వం మున్సిపాలిటీ స్వాధీనం చేసుకొని, ప్రజల బహుళ ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.