చిట్యాలలో కేటీఆర్‌కు ఘన స్వాగతం
07-01-2026 12:27 PM
చిట్యాల,(విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR)కు చిట్యాల పట్టణంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బుధవారం ఘన స్వాగతం పలికారు. ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్తున్న కేటీఆర్ కు మార్గమధ్యలో నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల పట్టణంలో పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. నకిరేకల్ మాజీ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య కేటీఆర్ కు శాలువా కప్పి, పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. కేటీఆర్ అభిమానులకు అభివాదం చేస్తూ వచ్చే మున్సిపల్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని, పార్టీ నాయకులను కార్యకర్తలను,అభిమానులను ఆయన కోరారు.




