calender_icon.png 8 January, 2026 | 11:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్ ను ప్రారంభించిన మంత్రి

07-01-2026 12:29:52 PM

మందమర్రి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా మందమర్రి ఆర్టీసీ బస్టాండ్(Mandamarri RTC bus stand)లో నూతన షెడ్యూల్ బస్సును బుధ వారం మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి(Minister Gaddam Vivek Venkat Swamy) ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంచిర్యాల నుంచి రామకృష్ణాపూర్ కు బస్సు సౌకర్యం కల్పించడంతో పాటు మందమర్రికి లింక్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ బస్సును మంచిర్యాల నుంచి మందమర్రికి వయా రామకృష్ణాపూర్ మీదుగా నడుపనున్నామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు ముఖ్యంగా మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.