09-12-2025 09:11:18 PM
హనుమకొండ (విజయక్రాంతి): ఐదు సంవత్సరాల న్యాయ విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్ ని కలిసి కాకతీయ యూనివర్సిటీ హాస్టల్ డైరెక్టర్ రాజ్ కుమార్ ని సస్పెండ్ చేయాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా న్యాయ కళాశాల విద్యార్థులు మాట్లాడుతూ హాస్టల్ డైరెక్టర్ విద్యార్థుల సమస్యలను సరిగా పట్టించుకోవడంలేదని, విద్యార్థులను అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నాడని, అలానే విద్యార్థుల మధ్య గొడవలు పెడుతూ మెస్ లో విద్యార్థుల మధ్య ఘర్షణాపూరితమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాడని తెలిపారు.
సోమవారం సాయంత్రం ఉద్దేశపూర్వకంగానే చట్ట వ్యతిరేకంగా మెస్ ను మూసి, మెస్ కార్డు ఉన్నప్పటికీ కూడా కొంతమంది విద్యార్థులకు భోజనాన్ని పెట్టలేదని, కనీసం ఫోన్ చేసినా పట్టించుకోలేదని ఏడున్నర గంటలకు పెట్టాల్సిన భోజనాన్ని అర్ధరాత్రి 1 గంటకు యూనివర్సిటీ మెస్ ను నుండి తెప్పించి పెట్టారని వివరించారు. కావున తక్షణమే చట్ట వ్యతిరేకంగా మెస్సును మూసివేసి విద్యార్థి వ్యతిరేక పాలనను కొనసాగిస్తున్నా హాస్టల్ డైరెక్టర్, లా జేడి లని సస్పెండ్ చేసి విద్యార్థులకు న్యాయమైన భోజనం అందేలా చర్యలు చేపట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రాకేష్ రెడ్డి, అరుణ్, సందీప్, స్టాలిన్, రంజిత్, రణధీర్, ప్రదీప్, రోహిత్, యోగేష్,జితన్, సాత్విక్, ఆదిత్య, దుర్గేష్, శివాజీ, శీను, సుకుమార్, సాయి తదితర విద్యార్థులు పాల్గొన్నారు .