09-12-2025 09:15:27 PM
కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు మందుల భాను కిరణ్
తుంగతుర్తి (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపుతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు మందుల భాను కిరణ్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జటంగి. లింగమూర్తిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పేద ప్రజల అభివృద్ధి కోసం ఉచిత కరెంటు, సన్న బియ్యం, రుణమాఫీ, మహిళా సంఘాలకు పొదుపు రుణాలు, మహాలక్ష్మి పథకం, ఇందిరమ్మ ఇండ్లు పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుమల ప్రగడ అనురాధ కిషన్రావు, యువజన నాయకులు తిరుమల ప్రగడ రాహుల్, వెంకన్న, రాజు తదితరులు పాల్గొన్నారు.